Sunday, September 6, 2020

హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం అథవా శ్రీహరిహరాత్మకస్తోత్రం

శ్రీ హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం అథవా శ్రీహరిహరాత్మకస్తోత్రం 




---------------------------


---------------------------

గోవింద మాధవ ముకుంద హరే మురారే
     శంభో శివేశ శశిశేఖర శూలపాణే .
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 1..

గంగాధరాంధకరిపో హర నీలకంఠ
     వైకుంఠ కైటభరిపో కమఠాబ్జపాణే .
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 2..

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
     గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ .
నారాయాణాసురనిబర్హణ శార్ఙ్గపాణే
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 3..

మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో
     శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే .
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 4..

లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
     శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే .
ఆనందకంద ధరణీధర పద్మనాభ
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 5..

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
     బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే .
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 6..

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
     భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ .
చాణూరమర్దన హృషీకపతే మురారే
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 7..

శూలిన్ గిరీశ రజనీశ కలావతంస
     కంసప్రణాశన సనాతన కేశినాశ .
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 8..

గోపీపతే యదుపతే వసుదేవసూనో
     కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర .
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 9..

స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
     కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే .
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
     త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి .. 10..

అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
     సందర్భితాం లలితరత్నకదంబకేన .
సన్నాయకాం దృఢగుణాం నిజకంఠగతాం యః
     కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ .. 11..

గణావూచతుః .
ఇత్థం ద్విజేంద్ర నిజభృత్యగణాన్సదైవ
     సంశిక్షయేదవనిగాన్స హి ధర్మరాజః .
అన్యేఽపి యే హరిహరాంకధరా ధరాయాం
     తే దూరతః పునరహో పరివర్జనీయాః .. 12..

అగస్త్య ఉవాచ .
యో ధర్మరాజరచితాం లలితప్రబంధాం
     నామావలిం సకలకల్మషబీజహంత్రీం .
ధీరోఽత్ర కౌస్తుభభృతః శశిభూషణస్య
     నిత్యం జపేత్స్తనరసం న పిబేత్స మాతుః .. 13..

ఇతి శృణ్వన్ కథాం రమ్యాం శివశర్మా ప్రియేఽనఘాం .
ప్రహర్షవక్త్రః పురతో దదర్శ సరసీం పురీం .. 14..

ఇతి (శ్రీస్కందపురాణే కాశీఖండే ధర్మరాజప్రోక్తం
హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం .

Sunday, May 10, 2020

దేవతలు చేసిన శివ స్తుతి - వింధ్య పర్వతము పెరుగుదల నాపుటకు

దేవతలు చేసిన శివ స్తుతి - వింధ్య పర్వతము పెరుగుదల నాపుటకు




గణనాథాయ దేవాయ గిరిశాయ నమోస్తుతే | మహావిభూతిదాత్రేతే మహావిష్ణు స్తుతాయ చ. 
విష్ణుహృత్కంజవాసాయ మహాయోగరతాయ చ | యోగ గమ్యాయ యోగాయ యోగినాంపతయే నమః 
యోగీశాయ నమస్తుభ్యం యోగానాం ఫలదాయినే | దీనదానపరాయాపి దయాసాగర మూర్తయే. 
ఆర్తి ప్రశమనాయోగ్ర వీర్యాయ గుణమూర్తయే | వృషధ్వజాయ కాలాయ కాలకాలాయతే నమః
సర్వ దేవేశ గిరిశ శశిమౌళివిరాజిత | ఆర్తానాం శంకరస్త్వంచ శం విధేహి మహాబల.
అస్మాకం చ భయార్తానాం భవానేవ హిదృశ్యతే| దుఃఖనాశకరో దేవ ప్రసీద గిరిజాపతే.


గణాధ్యక్షా ! పార్వతీ సేవిత పాదపద్మా ! భక్తులకు అష్టసిద్ధు లొసంగు మహాదేవా ! నీకు జయమంగళ మగుత. మహామాయను గూడి విలసిల్లు పరమాత్మా ! వృషభవాహనా ! అమరేశ్వరా ! కౌలాసవాసా ! అహిర్బుధ్న్యా! మాన్య! మను! మానదా ! అజ! బహురూపా !స్వాత్మారామా ! శంభూ ! గణనాథా ! దేవా ! గిరిశా ! నీకు నమస్కారములు. మహావిభూతి దాయకా ! మహావిష్ణు సన్నుతా ! విష్ణురూపా ! విష్ణు హృదయ కమలవాసా ! మహాయోగరతా ! యోగగమ్యా ! యోగరూపా ! యోగీశా! నీకు నమస్కారములు. దేవ! యోగివర్యా! యోగిఫలదాయకా! దయాసాగరమూర్తి! దీనదయాపరా! నీకు నమస్కారములు. దేవా! యోగివర్యా! యోగిఫలదాయకా! దయాసాగరమూర్తి ! దీనదయాపరా! నీకు నమస్కారములు. దేవ ! ఆర్తిని బాపుదేవా!ఉగ్రవీర్యా! గుణనిధానా !వృషభధ్వజా ! కాల! కాలకాలా!నీకు నస్కారములు దేవా! సర్వదేవేశా ః గిరిశా ః చంద్రశేఖరా ! మహాబలా! ఆర్తుల యార్తి బావు దేవ ! మాకు మేలు వెల్గుబాట చూపించుము. మా బోటి భయార్తులకిక నీవే దిక్కు. గిరిజాపతీ ! దేవా దయ జూడుము ! మా దుఃఖము బాపుము !



శ్రీ శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున నాల్గవ యధ్యాయము నుండి.

Friday, April 3, 2020

దేవదానవకృత శ్రీ శంకర స్తుతిః(నామ సప్తతి రూపా)

దేవదానవకృత శ్రీ శంకర స్తుతిః(నామ సప్తతి రూపా)



నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే తిగ్మచక్షుషే | నమః పినాకహస్తాయ ధన్వినే కామరూపిణ.29
నమస్తే శూలహస్తాయ దణ్డహస్తాయ ధూర్జటే| మనసై#్త్రలోక్యనాథాయ భూతగ్రామశరీరిణ. 30
నమ స్సురారిహన్త్రే చ సోమార్కవహ్నిచక్షుషే| బ్రహ్మణ చైవ రుద్రాయ నమస్తే విష్ణురూపిణ.31
బ్రహ్మణ వేదరూపాయ నమస్తే విశ్వరూపిణ | సాఖ్ఖ్యయోగాయ భూతానాం నమస్తే శమ్భవాయ తే. 32
మన్మథాఙ్గవినాశాయ నమః కాలక్షయఙ్కర| రంహసే దేవదేవాయ నమస్తే వసురేతసే. 33
ఏకవీరాయ సర్వాయ నమః పిఙ్గకపర్దినే హర్త్రే కర్త్రే నమస్తుభ్యం నమ స్త్రిపురగాతినే. 34
శుద్ధబోధ ప్రబుద్ధాయ ముక్తికైవల్యరూపిణ | లోకత్రయవిదాతేరే చ వరిణన్ద్రా గ్ని రూపిణ. 35
ఋగ్యజుస్సామవేదాయ పురుషాయేశ్వరాయ చ| అగ్ర్యాయ చైవచో గ్రాయ విప్రాయ శ్రుతిచక్షుషే.36
రజసే చైవ సత్త్వాయ నమస్తే తామసాత్మనే| అనిత్యనిత్యబాసాయ నమమో నిత్యచరాత్మనే. 37
వ్యక్త్యాయ చైవావ్యక్త్యాయ వ్యక్తావ్యక్తాత్మనే నమః| భక్తానా మార్తినాసాయ ప్రియనారాయణాయచ. 38
ఉమా ప్రియాయ శర్వాయ నన్దివక్త్రాఞ్చితాయవై| ఋతుమన్వన్తర కల్పాయ పక్షమాసదినాత్మనే. 39
నానా రూపాయ ముణ్డాయ వరూథపృథుదణ్డినే| నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖణ్డినే. 40
దన్వినే రథినే చైవ యతయే బ్రహ్మచారిణ| శివాయ దేవదేవాయ నమ స్తుభ్యం నమో నమః. 41
అతని ఈ మాటవిని సురాసురులు భీతులై బ్రహ్మ విష్ణులను ముందుంచుకొని శంకరుని కడకుపోయిరి. ద్వారస్థులగు గణశులచే తెలుపబడి శివునిచే వారనుజ్ఞాతులై హేమమయము ముక్తామణి విభూషితము నిర్మల మణి సోపానయుతము వైడూర్యమణి స్తంభాలంకృతమునగు మందర గుహయందు ప్రవేశించి శివుని సమీపించిరి; అట దేవాసురులందరును బ్రహ్మను ముందుంచుకొని ఈ స్తోత్రముతో మహాదేవుని స్తుతించిరి.
విరూపాక్షా !తీక్‌ష్ణనేత్రా !పినాకహస్తా!ధన్విన్‌!కామరూపిన్‌!శూలహస్తా!దండహహస్తా!త్రైలోక్యనాధా!భూతనమూహమూర్తీ!సురారిహంతా!సోమసూర్యవహ్నినేత్రా!బ్రహ్మవిష్ణురుద్రరూపిన్‌!బ్రహ్మన్‌!వేదరూపా!విశ్వరూపిన్‌!సాంఖ్యయోగా!భూతాసంభవా!మన్మథదేహనాశకా!కాలక్షయాకరా!రంహో(వేగ) రూపా!దేవదేవా;వసురేతోరూపా!ఏకవీరా!సర్వా!పంగజటాజూటా!హర్తా ;కర్తా! త్రిపురఘాతిన్‌!శుద్ధబోధప్రబుద్ధా!ముక్తికైవల్యరూపా!లోకత్రయవిధాతా!వరుణంద్రాగ్ని రూపా!ఋగ్యజుఃసామరూపా!పురుషా!ఈశ్వరా!అగ్ర్యా!(శ్రేష్టా)ఉగ్రా!విప్రా!వేదనేత్రా!సత్త్వరజస్తమోరూపా!అనిత్యబాసా(ప్రకాశా)నిత్యచరాత్మకా!వ్యక్తరూపా!అవ్యక్తరూపా!వ్యక్తావ్యక్తారూపా!భక్తార్తినాశకా!నారాయణప్రియా!ఉమావ్రియా!శర్వా!నందిముకాంచితా!ఋతుమన్వంతర కల్పవృక్షమాసదికానాత్మక నానారూపా! ముండరూపా!వరూథ(కవచ) రూపా!పృథుదండిన్‌! కపాలహస్తా! దిగంబరా! శిఖండిన్‌! ధన్విన్‌! రథిన్‌! యతీ! బ్రహ్మచారిన్‌! శివా! దేవదేవా! సమస్తుభ్యం - నమస్తుభ్యమ్‌(నీకు నమస్కారము).


శివ పూజాదులందు ఈ నామావళి నుపయోగించుకొనవచ్చును.
ఓం విరూపాక్షాయనమః దేవదేవాయ వ్యక్తాయ

తిగ్మచక్షుషే వసురేతసే అవ్యక్తాయ

పినాకహస్తాయ ఏకవీరాయ వ్యక్తావ్యక్తాత్మనే

ధన్వినే సర్వాయ భక్తానాం ఆర్తినాశాయ

కామరూపిణే పింగకపర్దినే ప్రియనారాయణాయ

శూలహస్తాయ హర్త్రే ఉమాప్రియాయ

దండహస్తాయ కర్త్రే శర్వాయ

ధూర్జటయే త్రిపురఘాతినే నంది వక్త్రాంచితాయ

త్రైలోక్యనాధాయ శుద్ధభోదప్రబుద్ధాయ ఋతుమన్వన్తరకల్పాయ

భూతగ్రామ శరీరిణే ముక్తి కైవల్య రూపిణ పక్షమానదినాత్మనే

సురారిహన్త్రే లోకత్రయ విధాత్రే నానారూపాయ

సోమార్క వహ్నిచక్షుషే వరుణేద్రాగ్ని రూపిణ ముండాయ

బ్రహ్మణే ఋగ్యజుస్సామ వేదాయ వరూథినే60

రుద్రాయ పురుషాయ

విష్ణురూపిణే ఈశ్వరాయ పృథుదండినే
బ్రహ్మణే అగ్ర్యాయ కపాలహస్తాయ

వేదరూపాయ ఉగ్రాయ  దిగ్వాసాయ (సనే)

విశ్వరూపిణ విప్రాయ ధన్వినే

యోగాయ శ్రుతిచక్షుసే రథినే

సాంఖ్యాయ రజసే యతయే

భూతానాం శంభవాయ  సత్త్వాయ బ్రహ్మచారిణే

మన్మథాంగ వినాశాయ తామసాత్మనే శివాయ

కాలక్షయంకరాయ అనిత్య నిత్యభాసాయ దేవదేవాయనమః

రంహసే నిత్య చరాత్మనే
శ్రీ మత్స్య మహాపురాణమున అమృత మథనమున ఈశ్వరుడు కాలకూటమును భక్షించుటయను రెండు వందల నలువది తొమ్మిదవ యధ్యాయము  నుండి.

Monday, March 30, 2020

బాణాసుర కృత శివస్తుతి

బాణాసుర కృత శివస్తుతి


ఓం : శివ శజ్కర శర్వ హారాయ నమో | భవ భీమ మహేశ్వర దేవ నమః. 64
కుసుమాయుధదేహవినాశకర త్రిపురాన్తక అన్ధక శూలదర |
ప్రమాదప్రియకాన్తవిభ(ర)క్త నమ | స్ససురాసుసిద్ధగణౖ ర్నమిత. 65
హయవానరసింహగ జేన్ద్రముఖై -| రతిహ్రస్వకదీర్ఘముఖైశ్చ గణౖః |
ఉపలబ్ధు మశక్యతరై -|రమరైర్వ్యథితోస్మి శరీరశతైర్బహుభిః 66
ప్రణోతోస్మి భవం భవ ! భక్తి మతిశ్చలచన్ద్రకలాకులదేవ! నమః |
న హి పుత్త్రకళత్రహయాదిధనం ! సతతం మమ దేవ తవ స్మరణమ్‌. 67
వ్యథితోస్మి తు బాహుశతై ర్బహుభి-|ర్గమితాచ మహానరకస్య గతిమ్‌ |
న నివర్తతి జన్మ న పాపమతి శ్శుచికర్మ నిబద్ధమపి త్యజతి. 68
అనుకమ్పతి విభ్రమతి త్రసతి | మమ చైవ కుకర్మ నివారయతి |
యః పఠే త్తోటకం వృత్తం ప్రయత శ్శుచిమానసః. 69
బాణసైవ యథా రుద్ర స్తసై#్యవం వరదో భవేత్‌ | ఇదం స్తవం మహాదివ్యం శ్రుత్వా దేవో మహేశ్వరః.

''ప్రణవ స్వరూపా! శుభరూపుడవు శుభకరుడవు పాపుల హింసించువాడవు పాపముల హరించువావు మన్మథ శరీర నాశకుడవు త్రిపుర నాశకుడవు అంధకుని చంపిన వాడవు శూలధరుడవు ప్రియురాలగు పార్వతియందలి ప్రీతితో దేహమును విభిజించుకొని సగమామెకిచ్చి ఆమెకు ప్రీతిపాత్రుడయినవాడవు సుందరుడవు సురాసుర సిద్ధగణములచేతను హయకపి సింహగజ ముఖులను మిగుల పొట్టివోపాడవయినచో అగు ముఖములు గలవారునగు ప్రమథులచేతను నమస్కాములందుకొనువాడువునగు నీకు నమస్కారము; వీరు ఇట్టి స్వభావము గలవారని గ్రహింపనలవికాని దేవతల వలనను అనేక జన్మములందు కలిగిన వందలకొలది శరీరముల వలనను చాల వ్యథలనందితిని. భవుడవగు నీయందు భక్తిగల మతిగల వాడనగుచు నిన్ను నమస్కరించుచున్నాను; చలించుచుండు చంద్రకళతో వ్యాప్తుడవగు దేవా! నమస్కారము; దేవా ! నీకు పుత్త్రకళత్ర హయాది ధనమువలదు; సతతము నీ స్మరణము కావలయును; ఈ అనేక శతబాహువులతో కూడా నాకు వ్యథయే కలుగుచున్నది; వీని మూలమున నేను నరకగతిని పొందింపబడుదునే కాని పుణ్యగతి నందను; వీనిచే జన్మ నివృత్తి కలుగదు, పాపమతియగువాడు నిబద్దమగు (శాస్త్ర విహితమగు) పవిత్ర కర్మమును విడిచి పెట్టును; కాని నామనస్సు వెనువెంటనే మాటిమాటికి కంపించుచున్నది, భ్రాంతి నందుచున్నది; భయమందుచున్నది; అందుచే నన్ను దుష్కర్మమునుండి నివారించుచున్నది.
ప్రయతుడయి (స్నానముచేసి మడుగు వస్త్రముల ధరించి) శుచి మనస్కుడయి ఈ తోటక వృత్త రూపమగుస్తవమును పఠించువానిని శివుడగు బాణు ననుగ్రహించినట్లే యనగ్రహించి అతనికి వరదుడగును. 

శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున ఈశ్వరుడు బాణాసురుని త్రిపురములను దహించుటయను నూట డెబ్బది ఏవవ అధ్యాయము నుండి.

Saturday, March 28, 2020

కమార జయ గాథ

కమార జయ గాథ


జయాతుల శక్తిదీధితిపి ఞ్జర- భుజదణ్డచణ్డరణరభస- సురవదన కుముదకాననవికాసనేన్దో-కుమారవర- జయ దితిజకులమహో దధిబడబానల- షణ్ముఖ- మధురరవమయూర రథ- సురముటుట కోటిఘట్టిత చరణసఖాజ్కురమహసన- జయ లలితచూడాక లాపవనమిమలదళ కమలకాన్త- దైత్యేశవంశదుస్సహదావా నల- జయ విశాఖ విభో-జయ బాల సప్తవాసర- దేవ సేనానాయక జయ సకలలోకతారక-స్కన్ద-జయ గౌరీ నన్దన-ఘణ్టాప్రియ-ప్రియ-విశాడ- విభో ధృతపతాక ప్రకీర్ణ ప్రచలకనకభూషణభాసుర దినకరచ్ఛాయ - జయజనితసమ్భ్రమలీలాలూనాఖిలారాతే - జయ సకలలోకతారక- దితిజాసురవరతారకాన్తక-జయ భువనావళిశోక వినాశన!

గాథార్థము

సాటిలేని శక్తియను అయుధపు కాంతులతో పింజరవర్ణుడా! భుజదండములతో భయంకరమగు యుద్దావేశము కలవాడా! దేవతా ముఖములనెడు కలువలకు వికాసము కలిగించు చంద్రా! కుమారులలో శ్రేష్ఠుడా! నీకు జయము; దైత్యవంశ మహ సముద్రమునకు బడబాగ్నీ! షణ్మఖా! మధుర ధ్వనిగల నెమిలిని పూనిచిన రథము కలవాడా! దేవతల కిరీటముల కొనలతోనలిగిన కాలి గోళ్ళ మొలకలతో కూడిన మహాపీఠము కలవాడా! నీకు జయము; సుందరమగు వెంట్రుకల కొప్పను కమల వనమందు ఉండిన విమల దళములుకల కమలములతో అందమగువాడా! దైత్యరాజు వంశమునకు సహింపరాని దావాగ్నీ! నీకు జయము; ప్రభూ!విశాఖా! ఏడు దినముల పసినాడా! సకలలోక తారకా!స్కందా! గౌరీనందనా! ఘంటాప్రియా! ప్రియావిశాఖా!విభూ!దేవ సనానాయకా! పతాకకలను దాల్చినవాడా! చెదరిపోయి మిగుల కదలుచున్న బంగారు సొమ్ములతో ప్రకాశించువాడా! సూర్యతేజస్కా ! నీకు జయము; యుద్ధ సంభ్రమమున అవలీలగా (ఆటగా) నమస్త శత్రువులను ఖండించువాడా! సకల లోక తారకా! ధితి సంతానమగు అసురులలో శ్రేష్ఠుడగు తారకునకు యముడా! భువన నమూహ శోక వినాశనా! జయము.
శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారకుడు దేవసేనను చూచుయను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము నుండి.

అమరకృత కుమార స్తుతిః

అమరకృత కుమార స్తుతిః


నమః కుమారాయ మహాప్రభాయ స్కన్దాయ చాస్కన్ధితదానవాయ l
నవార్క బిమ్బద్యుతయే నమోస్తు నమోస్తుతే షణ్ముఖ కాలరూపిణ. 13
పినదత్ధనానాభరణాయ భర్త్రే నమో రణ దారుణదారణాయ l
నమోస్తు తేర్కప్రతిమప్రభాయ నమోస్తు గుహ్యాయ గుహ్యాయ తుభ్యమ్‌. 14
నమోస్తుతే లోకభయావహాయ నమోస్తు తే బాలకృపాపరాయ l
నమో విశాలాయతలోచనాయ నమో విశాఖాయ మహావ్రతాయ. 15
నమో నమస్తేస్తు మనోరమాయ నమో నమస్తేస్తు గుణోత్కటాయ l
నమో మయూరోజ్జ్వలవాహనాయ నమోస్తు కేయూరధరాయ తుభ్యమ్‌. 16
నమో ధృతోదగ్రవతాకినేస్తు నమః ప్రభావప్రణతాయ తేస్తు l
నమోస్తు ఘణ్టాధరవీర్యుశాలినే క్రియాపరాణాం భవ భవ్యమూర్తయే . 17
క్రియాపరా యజ్ఞవతిం చ స్తుత్వా విరేమురేవం హ్యమరాధిపాద్యాః l

అమరులు చేసిన కమార స్తుతి.
గొప్ప కాంతిగలవాడును దానవులను నశింపజేయువాడును నూతన రవి బింబతేజుడును కాలరూపుడునునగు కుమారునకు స్కందునకు షణ్ముఖునకు నమస్కారము. నానా భరణములను ధరించినవాడును లోకముల కధిపతియు లోక పోషకుడును రణమునందు దారుణులగు వారినికూడ చీల్చువాడును రవి సమానతేజుడును యోగులగు తప్ప ఎరుక పడని రహస్య స్వరూపుడును దేవసేనా రక్షకుడును అగు నీకు నమస్కారము. లోకముల భయము పోగొట్టువాడునుకృపా వరుడును విశాలములయి దీర్ఝములగు నేత్రములు కలవాడును మహా శ్రేష్ఠవ్రతుడు (వ్రతము=కర్మము-కృత్యము)ను అగు బాలుడగు విశాఖునకు నమస్కారము. మనస్సులకానందకారుడును సద్గుణములచే అందర మించినవాడును ప్రకాశించు మయూరము వాహనముగా గలవాడు భుజకీర్తుల ధరించినవాడును నగు నీకు వందనము. భయంకరము ఉన్నతము నగు పతాక ధరించినవాడు ప్రభావశాలురచేత కూడ ప్రణామములందుకొనునవాడు ఘంటను దరించినవాడు వీర్య శాలి క్రియా పరులగు (పురుష కారము చేయుచుండు) వారికై జన్మించిన మంగళ స్వరూపుడు అగు నీకు నమస్కారము. యజ్ఞపతియగు కుమారుని యజ్ఞ (హవిర్గ్రహణ) పరులగు ఇంద్రాదులు ఇట్లు స్తుతించి నమస్కరించిరి.

శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారకుడు దేవసేనను చూచుయను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము నుండి.

రతీదేవికృత శ్రీ శివస్తుతి

రతీదేవికృత శ్రీ శివస్తుతి


ఓం నమశ్శివాయాస్తు నిరామయాయ నమశ్శివాయస్తు మనోమయాయ|
నమశ్శివాయాస్తు సురార్చితాయ తుభ్యం సదా భక్తకృపాపరాయ. 260
నమో భవాయస్తు భవోద్భవాయ నమో స్తు తే ధ్వన్తమనోభవాయ |
నమో స్తుతే గూఢమహావ్రతాయ నమస్స్వమాయాగహనాశ్రయా. 261
నమో స్తు శర్వాయ నమశ్శివాయ నమోస్తు సిద్ధాయ పురాన్తకాయ|
నమోస్తు కాలాయ నమః కలాయ నమోస్తుతే జ్ఞానవరప్రదాయ. 262
నమోస్తుతే కాలకాలాతిగాయ నమో నిసర్గామలభూషణాయ| నమస్త్వమేయాన్ధకమర్ధనాయ నమశ్శరణ్యాయ నమో గుణాయ. 263
నమోస్తుతే బామగణానుగాయ నమోస్తు నానాభువనాదికర్త్రే | నమోస్తు నానాజగతాం విధాత్రే నమోస్తు తే చిత్రఫలప్రయోక్త్రే. 264
సర్వావసానే ప్యవినాశినే నమోస్తు చిత్రాధ్వరభాగభోక్త్రే| నమోస్తు కర్మప్రభవస్య దాత్రే నమస్సదాతే భవసఙ్గహర్త్రే. 265
అనన్తరూపాయ సదైవ తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్‌| శశాఙ్కచిహ్నాయ నమోస్తు తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్‌ . 266
వృషేన్ద్రయానాయ పురాన్తకాయ నమః ప్రసిద్ధాయ మహౌషధాయ| నమోస్తు భక్తాభిమతప్రదాయ నమోస్తు సర్వార్తిహరాయ తుభ్యమ్‌ .267
చరాచరాచార విచారవర్యమాచార్యముత్ప్రేక్షితభూతసర్గమ్‌ | త్వామిన్దుమౌళిం శరణం ప్రసన్నా ప్రియాప్రమేయం మహతాంమహేశమ్‌.268
ప్రయచ్ఛ మే కామయశస్సమృద్ధిం పునః ప్రభో జీవతు కామదేవః | వైధవ్య హర్త్రే భగవన్నమస్తే ప్రియం వినా త్వాం ప్రియజీవితేషు. 269
త్వత్తో పరః కో బువనేష్విహాస్తి ప్రభుః ప్రియాయాః ప్రభవః ప్రియాణామ్‌| త్వమేవ చైకో భువనస్య నాధో దయాళురున్మూలితభక్తభీతిః. 270
(ఓమ్‌) - లోకములకెల్ల శాంతియగు గాక ! ఏ దోషమును నాశమును లేనివాడును మనోమయుడును శుభకరుడును సురార్చితుడును భక్త కృపావరుడునునగు భగవానునకు సమస్కారము. సంసార రూపుడు సంసార జనకుడు మన్మథనాశకుడు రహస్య మహా వ్రతముల నాచరించువాడు స్వమాయకు గూఢముగా ఆస్రయ భూతుడు అగు దేవునకు నమస్సు. దుష్టహింసకుడుసిద్ధుడు త్రిపురాంతకరుడు కాలరూపుడు కాల ప్రేరకుడు జ్ఞన వరప్రదుడునకు మహాదేవునకు నమస్కారము. కాలావయవములకు అతీతుడు స్వస్వరూపమునెడు నిర్మల భూషణముకలవాడు అమేయుడు అంధకాసుర నాశకుడు శరణ్యుడు నిర్గుణుడునకు పరమేశునకు నమస్కారము. భయంకర గణములు తన వెంటనుండు వాడు నానా భువనములకును ఆదికర్త నానా జగన్నిర్మాత చిత్ర( వివధ) ఫలదాతయగు శివునకు వందనము. సర్వావసానమునందుకూడ నశించతని నేత్రములు కలవాడు నానావిధ యజ్ఞ భాగ భోక్త కర్మ సంజనిత ఫల నిర్మాత సంసార సంబంధనాశకుడు అగు మహాదేవునకు ప్రణామము. అనంత స్వరూపుడు అసహ్యకోపుడు చెంద్ర చిహ్నుడు ఆమేయమగు కొలత కలవాడు అగు నీకు నమస్సు. వృషభేంద్ర వాహనుడు పురాంతకుడు ప్రసిద్దుడు మహౌషద రూపుడు భక్తాభిమతద ప్రదుడు నర్వార్తి హరుడు నగు నీకు మనస్సు; చరాచర జగమందలి సకల ప్రాణుల- సకల పదార్థముల నడువడిని ఎరుగు వారితో శ్రేష్ఠుడు ఆచార్య (గురు) రూపుడు సంకల్పమాత్రమున భూతసృష్టి యొనర్చువాడు చంద్రమౌళి సర్వప్రియుడు అప్రమేయుడు గొప్పవారిలో గొప్పవాడు. మహేశుడునగు నిన్ను శరణు పొందితిని. ప్రభో! కామునకు ( నా పతికి) కీర్తి సమృద్ధి నిమ్ము. కామ దేవుని మరల బ్రదికింపుము. ప్రియ జీవితమును కరుణతో ఇచ్చుటకు సర్వప్రాణి ప్రియమగు ఆత్మ రూపుడవగు నీవు తప్ప ఈ భవనములందు మరెవ్వరు కలరు? మదన ప్రియమగు నాకు ప్రభువును ప్రియముల నొసగువాడను పరాపరార్థముల నిర్మించి భక్తుల కొసగువాడను సర్వభువన నాధుడును దయాపరుడును భక్తభీతి నాశకుడును నగువాడు నీవు తప్ప మరి ఎవ్వరును లేరు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున పార్వతీ పరమేశ్వర వివాహాది కథా నిరూపణమను నూట ఏబది మూడవ అధ్యాయము నుండి.