Saturday, March 28, 2020

కమార జయ గాథ

కమార జయ గాథ


జయాతుల శక్తిదీధితిపి ఞ్జర- భుజదణ్డచణ్డరణరభస- సురవదన కుముదకాననవికాసనేన్దో-కుమారవర- జయ దితిజకులమహో దధిబడబానల- షణ్ముఖ- మధురరవమయూర రథ- సురముటుట కోటిఘట్టిత చరణసఖాజ్కురమహసన- జయ లలితచూడాక లాపవనమిమలదళ కమలకాన్త- దైత్యేశవంశదుస్సహదావా నల- జయ విశాఖ విభో-జయ బాల సప్తవాసర- దేవ సేనానాయక జయ సకలలోకతారక-స్కన్ద-జయ గౌరీ నన్దన-ఘణ్టాప్రియ-ప్రియ-విశాడ- విభో ధృతపతాక ప్రకీర్ణ ప్రచలకనకభూషణభాసుర దినకరచ్ఛాయ - జయజనితసమ్భ్రమలీలాలూనాఖిలారాతే - జయ సకలలోకతారక- దితిజాసురవరతారకాన్తక-జయ భువనావళిశోక వినాశన!

గాథార్థము

సాటిలేని శక్తియను అయుధపు కాంతులతో పింజరవర్ణుడా! భుజదండములతో భయంకరమగు యుద్దావేశము కలవాడా! దేవతా ముఖములనెడు కలువలకు వికాసము కలిగించు చంద్రా! కుమారులలో శ్రేష్ఠుడా! నీకు జయము; దైత్యవంశ మహ సముద్రమునకు బడబాగ్నీ! షణ్మఖా! మధుర ధ్వనిగల నెమిలిని పూనిచిన రథము కలవాడా! దేవతల కిరీటముల కొనలతోనలిగిన కాలి గోళ్ళ మొలకలతో కూడిన మహాపీఠము కలవాడా! నీకు జయము; సుందరమగు వెంట్రుకల కొప్పను కమల వనమందు ఉండిన విమల దళములుకల కమలములతో అందమగువాడా! దైత్యరాజు వంశమునకు సహింపరాని దావాగ్నీ! నీకు జయము; ప్రభూ!విశాఖా! ఏడు దినముల పసినాడా! సకలలోక తారకా!స్కందా! గౌరీనందనా! ఘంటాప్రియా! ప్రియావిశాఖా!విభూ!దేవ సనానాయకా! పతాకకలను దాల్చినవాడా! చెదరిపోయి మిగుల కదలుచున్న బంగారు సొమ్ములతో ప్రకాశించువాడా! సూర్యతేజస్కా ! నీకు జయము; యుద్ధ సంభ్రమమున అవలీలగా (ఆటగా) నమస్త శత్రువులను ఖండించువాడా! సకల లోక తారకా! ధితి సంతానమగు అసురులలో శ్రేష్ఠుడగు తారకునకు యముడా! భువన నమూహ శోక వినాశనా! జయము.
శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారకుడు దేవసేనను చూచుయను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము నుండి.

No comments:

Post a Comment