బాణాసుర కృత శివస్తుతి
ఓం : శివ శజ్కర శర్వ హారాయ నమో | భవ భీమ మహేశ్వర దేవ నమః. 64
కుసుమాయుధదేహవినాశకర త్రిపురాన్తక అన్ధక శూలదర |
ప్రమాదప్రియకాన్తవిభ(ర)క్త నమ | స్ససురాసుసిద్ధగణౖ ర్నమిత. 65
హయవానరసింహగ జేన్ద్రముఖై -| రతిహ్రస్వకదీర్ఘముఖైశ్చ గణౖః |
ఉపలబ్ధు మశక్యతరై -|రమరైర్వ్యథితో೭స్మి శరీరశతైర్బహుభిః 66
ప్రణోతోస్మి భవం భవ ! భక్తి మతిశ్చలచన్ద్రకలాకులదేవ! నమః |
న హి పుత్త్రకళత్రహయాదిధనం ! సతతం మమ దేవ తవ స్మరణమ్. 67
వ్యథితో೭స్మి తు బాహుశతై ర్బహుభి-|ర్గమితాచ మహానరకస్య గతిమ్ |
న నివర్తతి జన్మ న పాపమతి శ్శుచికర్మ నిబద్ధమపి త్యజతి. 68
అనుకమ్పతి విభ్రమతి త్రసతి | మమ చైవ కుకర్మ నివారయతి |
యః పఠే త్తోటకం వృత్తం ప్రయత శ్శుచిమానసః. 69
బాణసైవ యథా రుద్ర స్తసై#్యవం వరదో భవేత్ | ఇదం స్తవం మహాదివ్యం శ్రుత్వా దేవో మహేశ్వరః.
''ప్రణవ స్వరూపా! శుభరూపుడవు శుభకరుడవు పాపుల హింసించువాడవు పాపముల హరించువావు మన్మథ శరీర నాశకుడవు త్రిపుర నాశకుడవు అంధకుని చంపిన వాడవు శూలధరుడవు ప్రియురాలగు పార్వతియందలి ప్రీతితో దేహమును విభిజించుకొని సగమామెకిచ్చి ఆమెకు ప్రీతిపాత్రుడయినవాడవు సుందరుడవు సురాసుర సిద్ధగణములచేతను హయకపి సింహగజ ముఖులను మిగుల పొట్టివోపాడవయినచో అగు ముఖములు గలవారునగు ప్రమథులచేతను నమస్కాములందుకొనువాడువునగు నీకు నమస్కారము; వీరు ఇట్టి స్వభావము గలవారని గ్రహింపనలవికాని దేవతల వలనను అనేక జన్మములందు కలిగిన వందలకొలది శరీరముల వలనను చాల వ్యథలనందితిని. భవుడవగు నీయందు భక్తిగల మతిగల వాడనగుచు నిన్ను నమస్కరించుచున్నాను; చలించుచుండు చంద్రకళతో వ్యాప్తుడవగు దేవా! నమస్కారము; దేవా ! నీకు పుత్త్రకళత్ర హయాది ధనమువలదు; సతతము నీ స్మరణము కావలయును; ఈ అనేక శతబాహువులతో కూడా నాకు వ్యథయే కలుగుచున్నది; వీని మూలమున నేను నరకగతిని పొందింపబడుదునే కాని పుణ్యగతి నందను; వీనిచే జన్మ నివృత్తి కలుగదు, పాపమతియగువాడు నిబద్దమగు (శాస్త్ర విహితమగు) పవిత్ర కర్మమును విడిచి పెట్టును; కాని నామనస్సు వెనువెంటనే మాటిమాటికి కంపించుచున్నది, భ్రాంతి నందుచున్నది; భయమందుచున్నది; అందుచే నన్ను దుష్కర్మమునుండి నివారించుచున్నది.
ప్రయతుడయి (స్నానముచేసి మడుగు వస్త్రముల ధరించి) శుచి మనస్కుడయి ఈ తోటక వృత్త రూపమగుస్తవమును పఠించువానిని శివుడగు బాణు ననుగ్రహించినట్లే యనగ్రహించి అతనికి వరదుడగును.
శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున ఈశ్వరుడు బాణాసురుని త్రిపురములను దహించుటయను నూట డెబ్బది ఏవవ అధ్యాయము నుండి.
No comments:
Post a Comment