Wednesday, December 9, 2020

అర్జున కృత శ్రీ శంకర స్తుతి

 అర్జున కృత శ్రీ శంకర స్తుతి




అర్జున ఉవాచ |


భక్త ప్రియస్య శంభోస్తే సు ప్రభో కిం సమీహితమ్‌ | వర్ణనీయం మయా దేవ కృపాలుస్త్వం సదాశివ || 
ఇత్యుక్త్వా సంస్తుతిం తస్య శంకరస్య మహాప్రభోః | చకార పాండవస్సో థ సద్భక్తిం వేదసంమతామ్‌ || 


నమస్తే దేవ దేవాయ నమః కైలాసవాసినే |    సదాశివ సమస్తుభ్యం పంచవక్త్రాయ తే నమః || 
కపర్దినే నమస్తుభ్యం త్రినేత్రాయ నమోస్తు తే | నమః ప్రసన్నరూపాయ సహస్రవదనాయ చ || 
నీలకంఠ నమస్తేస్తు సద్యోజాతాయ వై నమః | వృషధ్వజ నమస్తేస్తు వామాంగ గిరిజాయ చ || 


దశదోష నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే | డమరు కపాలహస్తాయ నమస్తే ముండమాలినే || 
శుద్ధస్పటిక సంకాశ శుద్ధకర్పూర వర్ష్మణే
 | పినాకపాణయే తుభ్యం త్రి శూలవరధారిణే || 

వ్యాఘ్రచర్మోత్తరీయాయ గజాంబరవిధారిణే | నాగాంగాయ నమస్తుభ్యం గంగాధర నమో స్తు తే || 

సుపాదాయ నమస్తే స్తు ఆరక్త చరణాయ చ | నంద్యాది గణసేవ్యాయ గణేశాయ చ తే నమః || 

నమో గణేశరూపాయ కార్తికేయానుగాయ చ | భక్తిదాయ చ భక్తానాం ముక్తాదాయ నమో నమః || 

అగుణాయ నమస్తేస్తు సగుణాయ నమో నమః | అరూపాయ సరూపాయ సకలాయాకలాయ చ || 
నమః కిరాతరూపాయ మదనుగ్రహకారిణే
 | యుద్ధప్రియాయ వీరాణాం నానాలీలానుకారిణే|| 


అర్జునుడిట్లు పలికెను-

ఓ మహాప్రభూ! భక్తప్రియుడవగు నీకు కోరదగినది ఏమి గలదని నేను చెప్పవలెను? ఓ దేవా! సదాశివా ! నీవు దయామూర్తివి . అర్జునుడు అపుడు ఇట్లు పలికి గొప్ప భక్తితో శంకరమహాప్రభుని ఉద్దేశించి వేద ధర్మమునకు అను రూపమగు చక్కని స్తుతిని చేసెను . దేవదేవుడు, కైలాసవాసి, సదాశివుడు, అయిదు మోములవాడు , జటా జూటధారి, ముక్కంటి, ప్రసన్నమగు రూపము గలవాడు, అనంతముఖములు గలవాడు , నీలకంఠుడు, సద్యోజాతుడు, వృషభధ్వజుడు, ఎడమ భాగమునందు పార్వతిని ధరించిన వాడు , పది భుజములు గలవాడు, పరమాత్మ, డమరువును కపాలమును చేతియందు ధరించినవాడు, కపాలమాలను దాల్చినవాడు , స్వచ్ఛమగు స్ఫటికము వలె కర్పూరము వలె తెల్లని దేహము గలవాడు, పినాకమును చేతబట్టినవాడు, గొప్ప త్రిశూలమును ధరించువాడు , వ్యాఘ్రచర్మమే ఉత్తరీయముగా గలవాడు, గజచర్మమును దాల్చినవాడు, పాములను శరీరావయవములయందు దాల్చినవాడు, గంగాధరుడు , ఎర్రని అందమైన పాదములు గలవాడు, నంది మొదలగు గణములచే సేవింపబడువాడు, గణాధ్యక్షుడు అగు నీకు అనేకానేక నమస్కారములు . కార్తికేయునిచే అనుసరింపబడే గణపతి నీ స్వరూపమే. భక్తులకు భక్తిని ముక్తిని కూడ ఇచ్చువాడు , నిర్గుణుడు, సగుణుడు, నీరూపుడు, సరూపుడు, నిరంశుడు, అంశములు గలవాడు, కిరాతరూపమును దాల్చి నన్ను అనుగ్రహించినవాడు, వీరులతో యుద్ధమును చేయుటలో ప్రీతి గలవాడు, అనేక లీలలను ప్రకటించువాడు నగు నీకు పునః పునః నమస్కారమ .

శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహితయందు కిరాతావతారవర్ణనమనే నలుబది ఒకటవ అధ్యాయము .

No comments:

Post a Comment