Saturday, March 28, 2020

రతీదేవికృత శ్రీ శివస్తుతి

రతీదేవికృత శ్రీ శివస్తుతి


ఓం నమశ్శివాయాస్తు నిరామయాయ నమశ్శివాయస్తు మనోమయాయ|
నమశ్శివాయాస్తు సురార్చితాయ తుభ్యం సదా భక్తకృపాపరాయ. 260
నమో భవాయస్తు భవోద్భవాయ నమో స్తు తే ధ్వన్తమనోభవాయ |
నమో స్తుతే గూఢమహావ్రతాయ నమస్స్వమాయాగహనాశ్రయా. 261
నమో స్తు శర్వాయ నమశ్శివాయ నమోస్తు సిద్ధాయ పురాన్తకాయ|
నమోస్తు కాలాయ నమః కలాయ నమోస్తుతే జ్ఞానవరప్రదాయ. 262
నమోస్తుతే కాలకాలాతిగాయ నమో నిసర్గామలభూషణాయ| నమస్త్వమేయాన్ధకమర్ధనాయ నమశ్శరణ్యాయ నమో గుణాయ. 263
నమోస్తుతే బామగణానుగాయ నమోస్తు నానాభువనాదికర్త్రే | నమోస్తు నానాజగతాం విధాత్రే నమోస్తు తే చిత్రఫలప్రయోక్త్రే. 264
సర్వావసానే ప్యవినాశినే నమోస్తు చిత్రాధ్వరభాగభోక్త్రే| నమోస్తు కర్మప్రభవస్య దాత్రే నమస్సదాతే భవసఙ్గహర్త్రే. 265
అనన్తరూపాయ సదైవ తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్‌| శశాఙ్కచిహ్నాయ నమోస్తు తుభ్యమమేయమానాయ నమోస్తు తుభ్యమ్‌ . 266
వృషేన్ద్రయానాయ పురాన్తకాయ నమః ప్రసిద్ధాయ మహౌషధాయ| నమోస్తు భక్తాభిమతప్రదాయ నమోస్తు సర్వార్తిహరాయ తుభ్యమ్‌ .267
చరాచరాచార విచారవర్యమాచార్యముత్ప్రేక్షితభూతసర్గమ్‌ | త్వామిన్దుమౌళిం శరణం ప్రసన్నా ప్రియాప్రమేయం మహతాంమహేశమ్‌.268
ప్రయచ్ఛ మే కామయశస్సమృద్ధిం పునః ప్రభో జీవతు కామదేవః | వైధవ్య హర్త్రే భగవన్నమస్తే ప్రియం వినా త్వాం ప్రియజీవితేషు. 269
త్వత్తో పరః కో బువనేష్విహాస్తి ప్రభుః ప్రియాయాః ప్రభవః ప్రియాణామ్‌| త్వమేవ చైకో భువనస్య నాధో దయాళురున్మూలితభక్తభీతిః. 270
(ఓమ్‌) - లోకములకెల్ల శాంతియగు గాక ! ఏ దోషమును నాశమును లేనివాడును మనోమయుడును శుభకరుడును సురార్చితుడును భక్త కృపావరుడునునగు భగవానునకు సమస్కారము. సంసార రూపుడు సంసార జనకుడు మన్మథనాశకుడు రహస్య మహా వ్రతముల నాచరించువాడు స్వమాయకు గూఢముగా ఆస్రయ భూతుడు అగు దేవునకు నమస్సు. దుష్టహింసకుడుసిద్ధుడు త్రిపురాంతకరుడు కాలరూపుడు కాల ప్రేరకుడు జ్ఞన వరప్రదుడునకు మహాదేవునకు నమస్కారము. కాలావయవములకు అతీతుడు స్వస్వరూపమునెడు నిర్మల భూషణముకలవాడు అమేయుడు అంధకాసుర నాశకుడు శరణ్యుడు నిర్గుణుడునకు పరమేశునకు నమస్కారము. భయంకర గణములు తన వెంటనుండు వాడు నానా భువనములకును ఆదికర్త నానా జగన్నిర్మాత చిత్ర( వివధ) ఫలదాతయగు శివునకు వందనము. సర్వావసానమునందుకూడ నశించతని నేత్రములు కలవాడు నానావిధ యజ్ఞ భాగ భోక్త కర్మ సంజనిత ఫల నిర్మాత సంసార సంబంధనాశకుడు అగు మహాదేవునకు ప్రణామము. అనంత స్వరూపుడు అసహ్యకోపుడు చెంద్ర చిహ్నుడు ఆమేయమగు కొలత కలవాడు అగు నీకు నమస్సు. వృషభేంద్ర వాహనుడు పురాంతకుడు ప్రసిద్దుడు మహౌషద రూపుడు భక్తాభిమతద ప్రదుడు నర్వార్తి హరుడు నగు నీకు మనస్సు; చరాచర జగమందలి సకల ప్రాణుల- సకల పదార్థముల నడువడిని ఎరుగు వారితో శ్రేష్ఠుడు ఆచార్య (గురు) రూపుడు సంకల్పమాత్రమున భూతసృష్టి యొనర్చువాడు చంద్రమౌళి సర్వప్రియుడు అప్రమేయుడు గొప్పవారిలో గొప్పవాడు. మహేశుడునగు నిన్ను శరణు పొందితిని. ప్రభో! కామునకు ( నా పతికి) కీర్తి సమృద్ధి నిమ్ము. కామ దేవుని మరల బ్రదికింపుము. ప్రియ జీవితమును కరుణతో ఇచ్చుటకు సర్వప్రాణి ప్రియమగు ఆత్మ రూపుడవగు నీవు తప్ప ఈ భవనములందు మరెవ్వరు కలరు? మదన ప్రియమగు నాకు ప్రభువును ప్రియముల నొసగువాడను పరాపరార్థముల నిర్మించి భక్తుల కొసగువాడను సర్వభువన నాధుడును దయాపరుడును భక్తభీతి నాశకుడును నగువాడు నీవు తప్ప మరి ఎవ్వరును లేరు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున పార్వతీ పరమేశ్వర వివాహాది కథా నిరూపణమను నూట ఏబది మూడవ అధ్యాయము నుండి.

No comments:

Post a Comment