అమరకృత కుమార స్తుతిః
నమః కుమారాయ మహాప్రభాయ స్కన్దాయ చాస్కన్ధితదానవాయ l
నవార్క బిమ్బద్యుతయే నమోస్తు నమోస్తుతే షణ్ముఖ కాలరూపిణ. 13
పినదత్ధనానాభరణాయ భర్త్రే నమో రణ దారుణదారణాయ l
నమోస్తు తేర్కప్రతిమప్రభాయ నమోస్తు గుహ్యాయ గుహ్యాయ తుభ్యమ్. 14
నమోస్తుతే లోకభయావహాయ నమోస్తు తే బాలకృపాపరాయ l
నమో విశాలాయతలోచనాయ నమో విశాఖాయ మహావ్రతాయ. 15
నమో నమస్తేస్తు మనోరమాయ నమో నమస్తేస్తు గుణోత్కటాయ l
నమో మయూరోజ్జ్వలవాహనాయ నమోస్తు కేయూరధరాయ తుభ్యమ్. 16
నమో ధృతోదగ్రవతాకినేస్తు నమః ప్రభావప్రణతాయ తేస్తు l
నమోస్తు ఘణ్టాధరవీర్యుశాలినే క్రియాపరాణాం భవ భవ్యమూర్తయే . 17
క్రియాపరా యజ్ఞవతిం చ స్తుత్వా విరేమురేవం హ్యమరాధిపాద్యాః l
అమరులు చేసిన కమార స్తుతి.
గొప్ప కాంతిగలవాడును దానవులను నశింపజేయువాడును నూతన రవి బింబతేజుడును కాలరూపుడునునగు కుమారునకు స్కందునకు షణ్ముఖునకు నమస్కారము. నానా భరణములను ధరించినవాడును లోకముల కధిపతియు లోక పోషకుడును రణమునందు దారుణులగు వారినికూడ చీల్చువాడును రవి సమానతేజుడును యోగులగు తప్ప ఎరుక పడని రహస్య స్వరూపుడును దేవసేనా రక్షకుడును అగు నీకు నమస్కారము. లోకముల భయము పోగొట్టువాడునుకృపా వరుడును విశాలములయి దీర్ఝములగు నేత్రములు కలవాడును మహా శ్రేష్ఠవ్రతుడు (వ్రతము=కర్మము-కృత్యము)ను అగు బాలుడగు విశాఖునకు నమస్కారము. మనస్సులకానందకారుడును సద్గుణములచే అందర మించినవాడును ప్రకాశించు మయూరము వాహనముగా గలవాడు భుజకీర్తుల ధరించినవాడును నగు నీకు వందనము. భయంకరము ఉన్నతము నగు పతాక ధరించినవాడు ప్రభావశాలురచేత కూడ ప్రణామములందుకొనునవాడు ఘంటను దరించినవాడు వీర్య శాలి క్రియా పరులగు (పురుష కారము చేయుచుండు) వారికై జన్మించిన మంగళ స్వరూపుడు అగు నీకు నమస్కారము. యజ్ఞపతియగు కుమారుని యజ్ఞ (హవిర్గ్రహణ) పరులగు ఇంద్రాదులు ఇట్లు స్తుతించి నమస్కరించిరి.
శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారకుడు దేవసేనను చూచుయను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము నుండి.
No comments:
Post a Comment