Thursday, December 3, 2020

యక్షేశ్వర రూప మహాదేవ స్తుతి

 యక్షేశ్వర రూప మహాదేవ స్తుతి







దేవా ఊచుః |

దేవదేవ మహాదేవ సర్వగర్వాపహారక | యక్షేశ్వర మహాలీల మాయా తేత్యద్భుతా ప్రభో || 1

మోహితా మాయయాద్యాపి తవ యక్షస్వరూపిణః | సగర్వమభిభాషంతస్త్వత్పురో హి పృథఙ్మయాః || 2

ఇదానీం జ్ఞాన మాయాతం తవైవ కృపయా ప్రభో | కర్తా హర్తా చ భర్తా చ త్వమేవాన్యో న శంకర || 3

త్వమేవ సర్వశక్తీనాం సర్వేషాం హి ప్రవర్తకః | నివర్తకశ్చ సర్వేశః పరమాత్మా వ్యయోద్వయః || 4

యక్షేశ్వరస్వరూపేణ సర్వేషాం నో మదో హృతః | కృతోమన్యామహే తత్తేనుగ్రహో హి కృపాలునా || 5

అథో స యక్షనాథోను గృహ్యవై సకలాన్‌ సురాన్‌ | విబోధ్య వివిధైర్వాక్యైస్తత్రై వాంతరధీయత || 6


దేవతలిట్లు పలికెను -

ఓ దేవదేవా! మహాదేవా! అందరి గర్వమును పోగొట్టువాడా! యక్షేశ్వరా! నీ లీలలు గొప్పవి, ప్రభూ! నీ మాయ అత్యద్భుతము (1).

యక్షస్వరూపుడవగు నీ మాయ మమ్ములను ఈ నాడు కూడ మోహింపజేయుటచే నీ ఎదుట మేము నీనుండి విడివడి (భేదబుద్ధితో) సగర్వముగా మాటలాడి యుంటిమి (2). 

ఓ ప్రభూ! నీ అనుగ్రహము చేతనే మాకు ఇపుడు జ్ఞానోదయమైనది. ఓ శంకరా! జగత్తుయొక్క సృష్టిస్థితిలయకర్త నీవు తక్క మరియొకరు కాదు (3). 

సర్వశక్తులను ప్రవర్తింప జేయువాడవు, మరియు నివర్తింప జేయువాడవు నీవే. నీవే సర్వేశ్వరుడవు, పరమాత్మవు, వినాశరహితుడవు, అద్వితీయుడవు (4). 

నీవు యక్షేశ్వర రూపమును దాల్చి మా అందరి గర్వమును పోగొట్టితివి. అట్లు చేసి దయానిధివగు నీవు మాయందు అనుగ్రహముచే చూపించితివని మేము భావించుచున్నాము (5). 

అపుడా యక్షేశ్వరుడు దేవతలందరినీ అనుగ్రహించి, అనేక వచనములను వారికి బోధించి అచటనే అంతర్ధానమయ్యెను (6).


శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు యక్షేశ్వరావతార వర్ణనమనే పదునారవ అధ్యాయము 

No comments:

Post a Comment