దేవకృతమహేశ్వరస్తవః
బ్రహ్మాదిదేవకృతమహాదేవస్తుతిః.
సర్వేషాం సర్వదం శమ్భుం గోపతిం పార్వతీపతిమ్ | దేవాః : నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ. 22
పశూనాం పతయే నిత్య ముగ్రాయచ కపర్దినే | మహాదేవాయ భీమాయత్ర్యమ్బకాయ విశామ్పత్యే. 23
ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వన్ధకఘాతినే | నీలగ్రీవాయ భీమాయ వేధసే వేధసాం పత్యే. 24
కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయచ | విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రథనాయచ. 25
నిత్యం నీలశిఖణ్డాయ శూలినే దివ్యశాయినే | ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేత సే. 26
అచిన్త్యా యామ్బికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ | పృషధ్వజాయ * చణ్ణాయ జటినే బ్రహ్మచారిణ. 27
తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయచ | విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే. 28
నమో೭స్తు దివ్యసేవ్యాయ ప్రభవే సర్వసమ్పదామ్ | అభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ సర్వదా. 29
భక్తానుకమ్పినే తుభ్యం దిశతే జన్మనో గతిమ్. 29
ఇట్టి శివుని దర్శించి దేవత లా దేవు నిట్లు స్తుతించిరి. (ఇది మాతృకా సంఖ్యతో ఏకపంచాశన్నామాత్మక మగు స్తోత్రము) భక్తులకు శుభకరుడు పాపులకు హింసకుడు బాధల తొలగించువాడు వరములొసగువాడు జీవుల కధిపతి భయంకరుడు జటాజూటధారి మహాదేవుడు దుష్టులకు భయంకరుడు త్రినేత్రుడు ప్రజాధిపతి ఈశ్వరుడు భగుడను
ఆదిత్యుని కొట్టినవాడు అంధకుని చంపినవాడు నీలకంఠుడు సూర్యాదులచే కూడ భయముతో పనులు చేయించువాడు లోకకర్తలకును కర్తలకును అధిపతి కుమారస్వామికి శత్రువులగువారి నశింపజేయువాడు కుమారస్వామికితండ్రి విశేషముగా జటాజూటమున ఎర్రనివాడు దూమ్రవర్ణుడు లోకముల ధరించువాడు పాపుల నరకువాడు నీలకేశుడు శూలధారి దివ్య శయనుడు ఉరగభూషణుడు సునేత్రుడు హిరణ్యము వసువు రేతస్సుగాగల అగ్ని స్వరూపుడు అచింత్యుడు అంబికా భర్త సర్వదేవస్తుతుడు వృషభధ్వజుడు దుష్టుల విషయమున కోపి జటాధారి బ్రహ్మచారి జలములందుండి తపమాచరించు చుండువాడు బ్రహ్మతత్త్వవేత్త ఆజితుడు విశ్వ స్వరూపుడు విశ్వస్రష్ట విశ్వమందావరించియుండువాడు దివ్యుల సేవలందు కొనువాడు సర్వసంపదలకు ప్రభువు ఆశ్రయింపదగినవాడు కోరికలు వేడదగినవాడు ఎల్లపుడు పనిలో మునిగియుండు వాడు భక్తాను కంపి జన్మమునకు తగిన ఉత్తమగతి నిచ్చువాడునగు దేవా నీకు నమస్కారము.
ఇందు దేవతాకృతశివస్తుతి మాతృకా (ఏకపంచాశత్) సంఖ్యాకముగానున్నది. ఇందలి మూల భూత భావనను ఇట్లు ఊహించవచ్చును : వాఙ్మయమంతయు ఏకపంచాశన్మాతృకా (వర్ణసమామ్నాయ) మయము. అ-నుండి అః-వరకు పదునారు; క-నుండి-మ-వరకు ఇరువదియైదు; య-ర-ల-వ-శ-ష-స-హ-ళ-క్ష-పది; మొత్తము ఏబదియొకటి. కావుననే శబ్దబ్రహ్మరూపయగు శ్రీదేవిని మాతృకారూపనుగా ఉపాసింతురు. కావున ఇట్లు మాతృకా సంఖ్యాకనామములతో స్తుతించుట సమస్త వాఙ్మయముతో స్తుతించుటయు శబ్ద రూపయగు పరమేశ్వరికిని పరమేశ్వరునకును అర్థ (సమస్త జగద్) రూపుడగు అభేదమును భావనచేసి సకల బ్రహ్మతత్త్వమునుపాసించుటయునగును. ఇది సాధకులకు సకలార్థ సాధకము.
ఆ నామావళి ఈ విధముగ నున్నది :
కపర్దినే క్రథనాయ అజితాయ
మహాదేవాయ నీలశిఖండాయ విశ్వాత్మనే
భీమాయ శూలినే విశ్వసృజే
త్ర్యంబకాయ 10
ఓం భవాయనమః వేధసాం పతయే వృషధ్వజాయ
శర్వాయ కుమారశత్రునిఘ్నాయ చండాయ
రుద్రాయ కుమారజననాయ 20
దివ్యశాయినే విశ్వం ఆవృత్య తిష్ఠతే
విశాంపతయే ఉరగాయ దివ్యసేవ్యాయ
ఈశ్వరాయ సునేత్రాయ సర్వసంపదాం ప్రభవే
భగఘ్నాయ హిరణ్యరేతసే 30
జటినే వరదాయ విలోహితాయ బ్రహ్మచారిణ
పశూనాంపతయే ధూమ్రాయ సలిలే తప్యమానాయ
ఉగ్రాయ ధరాయ బ్రహ్మణ్యాయ 40
అభిగమ్యాయ అంధకఘాతినే వసురేతసే కామ్యాయ
నీలగ్రీవాయ అచింత్యాయ సర్వదా సవ్యాపారాయ
భీమాయ అంబికాభర్త్రే భక్తానుకంపినే
వేధసే సర్వదేవస్తుతాయ జన్మనః-గతిం-దిశతే-
తుబ్యం నమః. 51
ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున బ్రహ్మాదిదేవతలు మహేశుని స్తుతించుటయను నూట ముప్పదియవ అధ్యాయము.
No comments:
Post a Comment