శుక్రకృత మహేశ్వరస్తుతిః.
నమోస్తు శితికణ్ఠాయ కనిష్ఠాయ సువర్చసే. 132
లేలిహానాయ కావ్యాయ వత్సరాయాన్ధసంపత్యే | కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ. 133
సంస్తుతాయ స్తుతార్థాయ దేవదేవాయ రంహసే | ఉష్ణీషిణ సువక్త్రాయ సహస్రాక్షయ మీఢుషే. 134
వసురేతాయ రుద్రాయ తవసే కృత్తివాససే | హ్రస్వాయ వ్వుప్తకేశాయ సేనాన్యే రోహితాయ చ. 135
కపయే రాజవృక్షయ తక్షకక్రీడనాయచ | సహస్రబాహవే చైవ సహస్రనయనాయచ. 136
సహస్రశిరసే చైవ బహురూపాయ వేధసే | హరాయ బహురూపాయ శ్వేతాయ పురుషాయచ. 137
గిరీశాయ మనోజ్ఞాయ చిత్తినే సుక్షతాయ చ | స న్తృప్తాయ సుహస్తాయ ధన్వినే భార్గవాయచ. 138
(ఈ స్తోత్రము శివత్రిశతీ నామాత్మకమయినది. ఇది పరమేశ్వరుని విరాట్స్వరూపమును నమస్త జగదాత్మ కత్వమును సకల జగదధిష్ఠాతృత్వమును ప్రతిపాదించుచున్నది. ఇది సకలోపషత్సారమును నామత్రిశతీ రూపమై రుద్రాధ్యాయముతో సమానమునునై ఇహపరములందు సకల పురుషార్థములను సులభముగ సమకూర్చ గలిగియున్నది. దీని యర్థము నెరిగి దీనిని పారాయణము చేయుట సకలాభీష్ట ఫలదాయకము-అనువాదకుడు.) నల్లని కంఠము కలవాడు సూక్ష్మతమరూపుడు శోభనమగు తేజస్సు కలవాడు లయము చేయువాడు కావ్యస్వరూపుడు-సంవత్సరరూపుడు అన్నమునకు అధిపతి-జటాజూటము కలవాడు (దుష్టులకు) భయంకరుడు-హర్యక్షు (కుబేరు)నకు వరములొసగినవాడు చక్కగా స్తుతింపబడువాడు-స్తుతింపబడిన అన్ని అర్థములును తానైనవాడు-దేవదేవుడు-వేగరూపుడు-తలపాగ ధరించినవాడు-అందమయిన మోము కలవాడు-మేలకొలది ఇంద్రియములు కలవాడు-కోరికలను ఇచ్చు వాడు-ధనమునకు బీజము వంటివాడు-దుష్టులను ఏడిపించువాడు తపోరూపుడు చర్మము వస్త్రముగా కలవాడు-చాలపొట్టివాడు-గొరగబడిన వెంట్రుకలు కలవాడు (మహాయతి) సేనాపతిరూపుడు ఎర్రనివాడు సూర్యరూపుడు-రాజవృక్షరూపుడు-తక్షకనాగుని క్రీడింపజేయువాడు-వేలకొలది భుజములు కలవాడు వేలకొలది కన్నులు కలవాడు-వేలకొలది శిరస్సులు కలవాడు అనేక రూపములు కలవాడు-సృష్టి సేయువాడు లోకములను హరించువాడు-అనేక దేహములు కలవాడు-తెల్లనివాడు-సర్వభూతముల దేహములయందును శయనించువాడు పర్వతమునుకు (వాక్కులకు) ఈశుడు మనోహరుడు - చిత్తముకలవాడు-క్షతులకు (దెబ్బతినిన వారికి) మేలుచేయువాడు-చక్కగా తృష్తి నొందియుండువాడు-చక్కని హన్తములు కలవాడు ధనవు ధరించిన వాడు-భార్గవ స్వరూపుడునగు వానికి నీకు నమస్కారము.
నిషఙ్గిణచ తారాయ «సాక్షాయ క్షపణాయచ | తామ్రాయచై వ భీమాయ ఉగ్రాయచ శివాయచ. 139
మహాదేవాయ శర్వాయ విరూపాయ శివాయచ | హిరణ్యాయ విశిష్టాయ జ్యేష్ఠాయ మధ్యమాయచ. 140
బభ్రవేచ పిశఙ్గాయ పిఙ్గళాయారుణాయచ | పినాకినే చేషుమతే చిత్రాయ రోమితాయచ. 141
దున్దుభ్యా యైకపాదాయ అహయే(అజాయ)బుధ్ని యాయచ|మృగవ్యాధాయ(శ)సర్వాయ స్థాణవే భీషణాయచ.
బహునేత్రాయ పథ్యయ సునేత్రా యేశ్వరాయచ | కపాలినే కవీరాయ మృత్యవే త్ర్యమ్బకాయచ. 143
వాస్తోష్పతే (తయే) పినాకాయ ముక్తయే కేవలాయచ|ఆరణ్యాయ గృహస్థాయ యతయే బ్రహ్మచారిణ. 144
సాఙ్ఖ్యాయచైవయోగాయ వ్యాధినే దీక్షితాయచ | అన్తర్హితాయ శర్వాయ భవ్యేశాయ శమాయచ. 145
అమ్ముల పొదులు కలవాడు నక్షత్ర రూపుడు (ప్రణవ రూపుడు) ఇంద్రియములతో కూడినవాడు-లోకములను (దుష్టులను) నశింపజేయువాడు ఎర్రనివాడు భయంకరుడు తీవ్రరూపుడు శుభకరుడు మహాదేవుడు (దేవతలందరలో గొప్పవాడు) దుష్టులను హింసించువాడు వికృతరూపుడు శుభరూపుడు ప్రకాశించువాడు గొప్పవాడు పెద్దవాడు మధ్యముడు బభ్రువర్ణము వాడు పసిమి ఎక్కువ ఎరుపు తక్కువ కలిసిన వన్నెవాడు పసిమి తక్కువ ఎరుపు ఎక్కువ కలిసిన వర్ణమువాడు ఎర్రనివాడు పినాకధనువు కలవాడు బాణములు దాల్చినవాడు అనేక వర్ణములవాడు రోహిత (ముదురు ఎరుపు) వర్ణమువాడు దుందుభియందుండువాడు ఒకే పాదము కలవాడు జన్మములేనివాడు ఆహిర్ బుధ్నియుడు మృగములను వెంటాడు వ్యాధరూపమువాడు ప్రతియొకటియు తానైనవాడు కదలనివాడు భీతిగొలుపువాడు అనేక నేత్రములు కలవాడు హితము కలిగించువాడు శోభన నేత్రములు కలవాడు ఈశ్వరుడు కపాలము ధరించినవాడు ఒకే యొక వీరుడు మృత్యువు-మూడు కన్నులు కలవాడు గృహమున కధిపతియగువాడు పినాక ధనుస్స్వరూపుడు కేవలరూపుడు వాన ప్రస్థుడు గృహస్థుడు యతి బ్రహ్మచారి సాంఖ్యదర్శనము యోగదర్శనము నైనవాడు వ్యాధులు (బోయవారు) తన సేనగా కలవాడు దీక్షస్వీకరించి యుండువాడు అంతర్ధానము నొందియుండువాడు హింస కలవాడు శుభమగు ఈశుడు శమస్వరూపుడు అగువానికి నమస్కారము.
రోహితే చేకితానాయ బ్రహ్మిష్ఠాయ మహర్షయే | చతుష్పదాయ మేధ్యాయ రక్షిణ శీఘ్రగాయచ. 146
శిఖణ్ణినే కరాళాయ దంష్ట్రిణ విశ్వవేధసే | భాస్కరాయ ప్రదీప్తాయ దీప్తాయచ సుమేధసే. 147
క్రూరాయ వికృతాయైవ బీభత్సాయ శివాయచ | సౌమ్యాయ చైవ పుణ్యాయ ధార్మికాయ శుభాయచ. 148
అవధ్యాయామృతాయైవ నిత్యాయ శాశ్వతాయచ | వ్యావృత్తాయ యవిష్ఠాయ భరతాయచ రక్షసే. 149
క్షేమ్యాయ సహమానాయ సత్యాయచ ఋతాయచ | ·కాట్యాయ రాసభాయైవ శూలినే దివ్యచక్షుషే. 150
సోమపా యాజ్యపాయైవ దూమపా యోష్మపాయయ | శచయే పరిధానాయ సద్యోజాతాయ మృత్యవే. 151
పిశితాశాయ శర్వాయ మేఘాయ విద్యుత్యాయచ | వ్యావృత్తాయ వరిష్ఠాయ భరతాయచ రక్షసే. 152
రోహితవర్ణుడు చాల తెలివి కలవాడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు మహర్షిరూపుడు-చతుష్పాదుడు పవిత్రుడు రక్షించు వాడు శీఘ్రముగా పోవువాడు జుట్టు ముడి కలవాడు నిమ్నోన్నత రూపుడుకోరలు కలవాడు విశ్వముల నృష్టించువాడు
కాంతుల నిర్మించువాడు తీవ్రముగా ప్రకాశించువాడు శోభనమగు గ్రంథధారణా సామర్థ్యము కలవాడు (శోభనమేధకలవాడు) క్రూరుడు వికృతరూపుడు అసహ్యము గొలుపువాడు శుభుడు నెమ్మదితనము కలవాడు పుణ్యరూపుడుధర్మము నెరిగినవాడు (ధర్మము ననుష్ఠించువాడు) శుభుడు-అవధ్యుడు అమృతుడు నిత్యుడు శాశ్వతుడు (సహజరూపుడు) తన లక్షణములు ఇంకెవరియందును లేనివాడు అందరికంటె కడగొట్టువాడు అందర భరించువాడు రక్షఃస్వరూపుడు క్షేమము కలిగించువాడు ఎవరినైనను ఏదైనను సహించువాడు సత్యరూపుడు ఋతరూపుడు ముండ్లతో నిండిన దుర్గమ ప్రదేశములందుండువాడు రాసభరూపుడు శూలి దివ్యనేత్రములు కలవాడు సోమపానము చేయువాడు ఆజ్యమును పానము చేయువాడు ధూమమును పానము చేయువాడు ఊష్మమును పానము చేయువాడు శుచిరూపుడు పరిధాన (ధరించు వస్త్రము) స్వరూపుడు తత్‌క్షణమే సాక్షాత్కరించువాడు మృత్యువును కలిగించువాడు పిశితము (పచ్చిమాంసము) ఆహారముగా తినువాడు శర్వుడు మేఘరూపుడు విద్యుద్రూపుడు అన్నిటినుండియు మరలియుండువాడు శ్రేష్ఠడు అందరను సోషించువాడు రక్షించువాడు అగువానికి నీకు నమస్కారము.
త్రిపురఘ్నాయ దీప్తాయ చక్రాయ రోమశాయచ | తిగ్మాయుధాయ దక్షాయ సమిద్ధాయ పుల స్తయే. 153
రోచమానాయ చణ్డాయ స్థితాయ ఋషభాయచ | వ్రతినే యుఞ్జమానాయ శుచయే చోర్ధ్వరేతసే. 154
అసుర ఘ్నే మఘఘ్నాయ మృత్యుఘ్నే చాన్తకాయచ | కృశానవే ప్రశాన్తాయ వహ్నయే కింశిలాయచ. 155
రక్షోఘ్నాయ పశుఘ్నాయ విఘ్నాయ శ్వసితాయచ | అనాహతాయ సర్వాయ వ్యాపినే తాపనాయచ. 156
అనాశ్రితాయ దేవాయ సమిత్యధిష్ఠితాయచ | కృష్ణాయచ జయన్తాయ లోకానా మీశ్వరాయచ. 157
హిరణ్యబాహవేచైవ పాశాయచ సమాయచ | సుకన్యాయ సుసస్యాయ ఈశానాయ సుచక్షుషే. 158
క్షిప్రేషనే సుధన్వాయ ప్రథమాయ శివాయచ | కపిలాయ పిశఙ్గాయ మహాదేవాయ ధీమతే. 159
మహాకామాయ దీప్తాయ రోదనాయ సహాయచ | దృఢధన్వినే కవచినే రథినేచ వరూథినే. 160
త్రిపురములను సంహరిచంఉవాడు ప్రకాశిచంచువాడు చక్రస్వరూపుడు-రోమములతో నిండినవాడు-తీక్షణములగు ఆయుధములు కలవాడు సమర్థుడు బాగుగా ప్రజ్వలించువాడు భక్తుల ఎదుట నిలుచువాడు బంగారువలె ప్రకాశించువాడు భయము గొలుపువాడు (భక్తుల నుద్ధరించుటకై) నిలువబడి యుండువాడు. ఋషభముని రూపుడు-వేదవ్రతముల ననుష్ఠించువాడు-పూనికతో నుండువాడు శుచియగువాడు ఊర్ధ్వరేతస్కుడు రాక్షసులను చంపువాడు యజ్ఞమును ధ్వంసముచేయువాడు మృత్యువును సంహరించినవాడు సర్వమును సమాప్తము చేయువాడు అగ్ని స్వరూపుడు ప్రశాంతుడు హవిస్సుడు మోసికొనిపోవువాడు కుత్సితములగు శిలలుకల ప్రదేశముల రూపమున నున్నవాడు-రక్షస్సుల చంపువాడు పశువుల (దుష్టజీవుల) చంపువాడు విఘ్నరూపుడు శ్వాసరూపుడు అనాహత నాదస్వరూపుడు సర్వరూపుడు వ్యాపించియుండువాడు తపింపచేయువాడు (సూర్యాగ్నిరూపుడు) దేనిని ఆశ్రయించక యుండువాడు దివ్ ధాతువునకు అర్థముగా నుండువాడు సమితులను (యుద్దములను-సమాజములను) అధిష్ఠించి యుండువాడు కృష్ణుడు జయంతుడు లోకములకు ఈశ్వరుడు హిరణ్యబాహుడు పాశరూపుడు సముడు శోభనములగు కన్యలు కలవాడు చక్కనిపైరుల రూపమున నుండువాడు జీవాత్మకును అధిష్ఠాతయగువాడు చక్కని నేత్రములు కలవాడు శీఘ్రముగా పోవు బాణములు కలవాడు శోభనమగు ధనువు కలవాడు మొట్టమొదటివాడు పరమాత్మరూపుడు కపిలవర్ణుడు పింగళవర్ణుడు మహాదేవుడు బుద్ధిశాలి గొప్ప సంకల్పములు కలవాడు ప్రకాశింపజేయువాడు దుష్టుల నేడిపించువాడు అందరనోడించువాడు దృఢ ధనువు గలవాడు కవచము కలవాడు రథము కలవాడు వరూథము (ఒక విధమగు కవచము-రథభాగము) కలవాడు అగు నీకు నమస్కారము.
భృగునాధాయ శుక్రాయ గహ్వరేష్ఠాయ వేధసే | అమోఘాయ ప్రశాన్తాయఅమృతాయ వృషాయచ. 161
నమోస్తు తుభ్యం భగవ న్మహతే కృత్తివాససే | పశూనాం పతయే తుభ్యం భూతానాంపతయే నమః. 162
ప్రణమ్య ఋగ్యజుస్సామ్నే స్వాహాయచ స్వధాయచ | వషట్కారాత్మనే చైవ తుభ్య మర్థాత్మనే నమః. 164
వసవేచైవ సార్థాయ రుద్రాదిత్యాశ్వినాయచ | నిర్గుణాయ గుణజ్ఞాయ వ్యాకృతాయ కృతాయచ. 165
స్వయమ్భువే ప్రజాయైవ అపూర్వప్రథమాయచ | ప్రజానాం పతయేచైవ తుభ్యం బ్రహ్మాత్మనే నమః. 166
ఆత్మేశాయాత్మవశ్యాయ సర్వస్యాతిశయాయచ | సర్వభూతాత్మభూతాయ తుభ్యం భూతాత్మనే నమః. 167
నిర్గుణాయ గుణజ్ఞాయ వ్యాకృతాయాకృతాయచ | విరూపాక్షాయ మిత్రాయ తుభ్యం సాఙ్ఖ్యాత్మనే నమః.
పృథివ్యై చాన్తరిక్షాయ దివ్యాయచ మహాయచ | జన స్తపాయ సత్యాయ తుభ్యం లోకాత్మనే నమః. 169
అవ్యక్తాయ మహాన్తాయ భూతాదే రిన్ద్రియాయచ | ఆత్మజ్ఞాయ విశిష్టాయ తుభ్యం సర్వాత్మనే నమః. 170
నిత్యాయ చాత్మలిఙ్గాయ సూక్ష్మాయ చేతనాయచ | బుద్ధాయ విభవేచైవ తుభ్యం మోక్షాత్మనే నమః. 171
నమస్తే త్రిషు లోకేషు నమస్తే పరత స్త్రిషు | సత్యాతన్త్యేషు మహాన్త్యేషు చతుర్‌షుచ నమోస్తుతే. 172
నామస్తోత్రే మయా హ్యస్మి న్యదపవ్యాహృతం భవేత్ |
మద్భక్త ఇతి బ్రహ్మణ్య తత్సర్వం క్షన్తు మర్హసి. 173
భృగువంశ రక్షకుడు-శుక్రాచార్యరూపుడు-హృదయ గుహయందుండువాడు-శాస్త్ర విధానముల చేయువాడు సఫలుడు ప్రశాంతుడు అమృతస్వరూపుడు సర్వభూతములను అమృతముతో తడుపువాడు భగవానుడు గొప్ప పరిమాణము కలవాడు గజచర్మము వస్త్రముగా గలవాడు జీవులకు అధిపతి సకల భూతములచే నమస్కరించపబడువాడు ఋగ్యజుఃసామ స్వరూపుడు స్వాహాకారరూపుడు వషట్కారరూపుడు ఆత్మరూపుడు అవధిరూపుడు సృష్టించువాడు నిర్మించువాడు సర్వము చేయువాడు పాపముల హరించువాడు దయాపరుడు దయనీయుడు (దీనుల రూపమున నుండువాడు) భూత వర్తమాన భవిష్యకాల రూపముల నుండువాడు కర్మరూపుడునగు నీకు నమస్కారము.
వసువులు సాధ్యులు రుద్రులు ఆదిత్యులు అశ్వినులు అను దేవతల రూపమున నుండువాడు నిర్గుణుడు త్రిగుణముల నెరిగినవాడు నామరూప విభాగమునొందినవాడు సృష్టిచేయబడిన ప్రపంచ రూపమున నుండువాడు తనకుతానై యుండువాడు (పుట్టిన) ప్రజల రూపముతో నుండువాడు పూర్వము ఎన్నడు లేనివాడు మొదటివాడు ప్రజాపతిరూపుడు బ్రహ్మరూపుడు తనకుతానే అధిపతియగువాడుతన అధీనమున తానుండువాడు అన్నిటిని అతిశయించినవాడు సర్వభూతములకు ఆత్మయగు వాడు భూతరూపుడునగు నీకు నమస్కారము.
నిర్గుణుడు గుణముల (తత్త్వము)ను ఎరిగినవాడు నామరూపాది విభాగము నొందినవాడు వేటిచేతను చేయబడనివాడు (స్వయంసిద్ధుడు) వికృతములగు (బేసి సంఖ్యగల) కన్నులు కలవాడు ఎల్ల భూతములకు మిత్రుడు (ఉదయించు సూర్యరూపమున నున్నవాడు) సాంఖ్య తత్త్వరూపుడునగు నీకు నమస్కారము. పృథివి అంతరిక్షము ద్యులోకము మహర్లోకము జన స్తవస్సత్యలోకములునను లోకముల రూపముననుండు నీకు నమస్కారము. నామ రూపాదికముతో వ్యక్తము కానివాడు మహద్‌రూపుడు భూతములకు ఆదియగువాడు ఇంద్రియరూపుడు ఆత్మ తత్త్వము నెరిగిన వాడు అన్నిటికంటెను గొప్పవాడు సర్వత త్త్వ రూపుడునగు నీకు నమస్కారము. నిత్యుడు ఆత్మలింగరూపుడు సూక్ష్ముడు చేతనరూపుడు బోధము (జ్ఞానము) పొందినవాడు సర్వవ్యాపియగువాడు మోక్షరూపుడునగు నీకు నమస్కారము. మూడు లోకములయందు ఉండు నీకు నమస్కారము. వీటికి పైగా ఉండు మూడు లోకములయందు ఉండు నీకు నమస్కారము. సత్యలోకముతో ముగియు నాలుగు లోకములయందును మహాలోకముతో ముగియు నాలుగు లోకములయందును ఉండు నీకు నమస్కారము.
బ్రహ్మజ్ఞుడవగు పరమేశ్వరా! ఈ నామస్తోత్రమునందు నేనేదైన పొరబాటులు పలికినను ఇది పలికిన ఇతడు నాభక్తుడేకదా యను దయతో నన్ను క్షమించ ప్రార్థించుచున్నాను.
సూతః: ఏవ మాభాష్య దేవేశ మీశ్వరం నీలలోహితమ్ |
బహ్వతిప్రణత స్తసై#్మ ప్రాఞ్జలి ర్వాగ్యతోభవత్. 174
కావ్యస్య గాత్రం సంస్పృశ్య హస్తేన ప్రీతిమా న్భవః | నికామందర్శనం దత్వా తత్రైవా న్తరధీయత. 175
తత స్సోన్తర్హితే తస్మి& దేవే సానుచరే తదా | తిష్ఠన్తీం పార్శ్వతో దృష్ట్వా జయన్తీమిద మబ్రవీత్. 176
శుక్రుడు దేవేశుడును ఈశ్వరుడును నీలలోహితుడు నగు శివునితో ఇట్లు పలికి బహువారములు మిగుల ప్రణామములు చేసి దోసిలియొగ్గి మౌనము వహించెను. భవుడును ప్రీతుడై శుక్రుని శరీరమును స్పృశించి మిక్కిలి స్పష్టముగా తన దర్శనమునిచ్చి అచ్చటనే అంతర్ధానమునందెను.
---------------------------------------------
ఓం శితికంఠాయ నమః
కనిష్ఠాయ
సువర్చసే
లేలిహానాయ
కావ్యాయ
వత్సరాయ
అంధసస్పతయే
కపర్దినే
కరాళాయ
హర్యక్షాయ. 10
వరదాయ
సంస్తుతాయ
స్తుతార్థాయ
దేవదేవాయ
రంహసే
ఉష్ణీషిణ
సువక్త్రాయ
సహస్రాక్షాయ
మీఢుషే
వసురేతాయ. 20
రుద్రాయ
తవసే
కృత్తివాససే
హ్రస్వాయ
వ్యుప్తకేశాయ
సేనాన్యే
రోహితాయ
కపయే
రాజవృక్షాయ
తక్షక క్రీడనాయ. 30
సహస్రబాహవే
సహస్రనయనాయ
సహస్రశిరసే
బహురూపాయ
వేధసే
హరాయ
బహురూపాయ
శ్వేతాయ
పురుషాయ
గిరీశాయ. 40
మనోజ్ఞాయ
చిత్తినే
సుక్షతాయ
సంతృప్తాయ
సుహస్తాయ
ధ్వనినే
భార్గవాయ
నిషంగిణ
తారాయ
సాక్షాయ. 50
క్షపణాయ
తామ్రాయ
భీమాయ
ఉగ్రాయ
శివాయ
మహాదేవాయ
శర్వాయ
విరూపాయ
శివాయ
హిరణ్యాయ. 60
విశిష్టాయ
జ్యేష్ఠాయ
మధ్యమాయ
బభ్రవే
పిశంగాయ
పింగళాయ
అరుణాయ
పినాకినే
ఇషుమతే
చిత్రాయ. 70
రోహితాయ
దుందుభ్యాయ
ఏకపాదాయ అజాయ
అహయేబుధ్ని యాయ
మృగవ్యాధాయ
సర్వాయ
స్థాణవే
భీషణాయ
బహునేత్రాయ
పథ్యాయ. 80
సునేత్రాయ
ఈశ్వరాయ
కపాలినే
ఏకవీరాయ
మృత్యవే
త్ర్యంబకాయ
వాస్తోష్పతయే
పినాకాయ
ముక్తయే
కేవలాయ. 90
ఆరణ్యాయ
గృహస్థాయ
యతయే
బ్రహ్మచారిణ
సాంఖ్యాయ
యోగాయ
వ్యాధినే
దీక్షితాయ
అంతర్హితాయ
శర్వాయ . 100
భ##వ్యేశాయ
శమాయ
రోహితే
చేకితానాయ
బ్రహ్మిష్ఠాయ
మహర్షయే
చతుష్పదాయ
మేధ్యాయ
రక్షిణ
శీఘ్రగాయ. 110
శిఖండినే
కరాళాయ
దంష్ట్రిణ
విశ్వవేధసే
భాస్కరాయ
ప్రదీప్తాయ
దీప్తాయ
సుమేధసే
క్రూరాయ
వికృతాయ. 120
బీభత్సాయ
శివాయ
సౌమ్యాయ
పుణ్యాయ
ధార్మికాయ
శుభాయ
అవధ్యాయ
అమృతాయ
నిత్యాయ
శాశ్వతాయ. 130
వ్యవృత్తాయ
యవిష్ఠాయ
భరతాయ
రక్షసే
క్షేమ్యాయ
సహమానాయ
సత్యాయ
ఋతాయ
కాట్యాయ
సభా(ఖా)య. 140
శూలినే
దివ్యచక్షుషే
సోమపాయ
ఆజ్యపాయ
ధూమపాయ
ఊష్మపాయ
శుచయే
పరిధానాయ
సద్యోజాతాయ
మృత్యవే. 150
పిశితాశాయ
శర్వాయ
మేఘాయ
విద్యుతా(త్యా)య
వ్యావృత్తాయ
వరిష్ఠాయ
భరతాయ
వక్షసే
త్రిపురఘ్నాయ
తీర్థాయ. 160
చక్రాయ
రోమశాయ
తిగ్మాయుధాయ
దక్షాయ
సమిధ్దాయ
పులస్తయే
రోచమానాయ
చండాయ
స్థితాయ
ఋషభాయ
వ్రతినే
యుంజమానాయ
శుచయే
ఊర్ధ్వరేతసే
ఆసురఘ్నే
మఘఘ్నాయ
మృత్యుఘ్నే
అంతకాయ
కృశానవే
ప్రశాంతయ. 180
వహ్నయే
కింశిలాయ
రక్షోఘ్నాయ
పశుఘ్నాయ
విఘ్నాయ
శ్వసితాయ
అనాహతాయ
సర్వాయ
వ్యాపినే
తాపనాయ. 190
అనాశ్రితాయ
దేవాయ
సమిత్యధిష్టితాయ
కృష్టాయ
జయంతాయ
లోకానామీశ్వరాయ
హిరణ్యబాహవే
పాశాయ
సమాయ
సుకన్యాయ. 200
సుసస్యాయ
ఈశానాయ
సుచక్షుషే
క్షప్రేషవే
సుధన్యాయ
ప్రథమాయ
శివాయ
కపిలాయ
పిశంగాయ
మహాదేవాయ. 210
శ్రీమతే
మహాకామాయ
దీప్తాయ
రోదనాయ
సహాయ
దృఢధన్వినే
కవచినే
రథినే
వరూథినే
భృగునాధాయ. 220
శుక్రాయ
గహ్వరేష్ఠాయ
వేధసే
అమోఘాయ
ప్రశాంతాయ
అమృతాయ
వృషాయ
భగవతే
మహతే
కృత్తివాసనే. 230
పశూనాంపతయే
భూతానాంపతయే
ప్రణవాయ
ఋచే
యజుషే
సామ్నే
స్వాహాయ
స్వధాయ
వషట్కారాత్మనే
అర్థాత్మనే. 240
స్రష్ట్రే
ధాత్రే
కర్త్రే
హర్త్రే
కృపణాయ
భవద్భూతభవిష్యాయ
కర్మాత్మనే
వసవే
సాధ్యాయ
రుద్రాయ. 250
ఆదిత్యాయ
అశ్వినాయ
నిర్గుణాయ
గుణజ్ఞాయ
వ్యాకృతాయ
కృతాయ
స్వయంభువే
ప్రజాయై
అపూర్వాయ
ప్రథమాయ. 260
ప్రజానాంపతయే
బ్రహ్మాత్మనే
ఆత్మేశాయ
ఆత్మవశ్యాయ
సర్వస్యాతిశయాయ
సర్వభూతాత్మభూతాయ
భూతాత్మనే
నిర్గుణాయ
గుణజ్ఞాయ
అవ్యాకృతాయ. 270
ఆకృతాయ
విరూపాక్షాయ
మిత్రాయ
సాంఖ్యాత్మనే
పృథివ్యై
అంతరిక్షాయ
దివ్యాయ
మహాయ
జనాయ
తపాయ. 280
సత్యాయ
లోకాత్మనే
అవ్యక్తాయ
మహాంతాయ
భూతాదయే
ఇంద్రియాయ
ఆత్మజ్ఞాయ
విశిష్టాయ
సర్వాత్మనే
నిత్యాయ. 290
ఆత్మలింగాయ
సూక్ష్మాయ
చేతనాయ
బుద్ధాయ
విభవే
మోక్షాత్మనే
పూర్వతస్త్రిఘలోకేషుస్థితాయ
పరతస్త్రిఘలోకేషుస్థితాయ
సత్యాంతేఘసప్తసులోకేషుస్థితాయ
మహాంత్యేషుచతుర్షు
లోకేషుస్థితాయనమః. 300
---------------------------------------------
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యదువంశ కథనమున శ్రీకృష్ణావతార ప్రసంగము న దై వాసుర యుద్ధాది కథనము భగవదవతార హేతు కథనమునను నలువది యేడవ అధ్యాయము.