Sunday, May 10, 2020

దేవతలు చేసిన శివ స్తుతి - వింధ్య పర్వతము పెరుగుదల నాపుటకు

దేవతలు చేసిన శివ స్తుతి - వింధ్య పర్వతము పెరుగుదల నాపుటకు




గణనాథాయ దేవాయ గిరిశాయ నమోస్తుతే | మహావిభూతిదాత్రేతే మహావిష్ణు స్తుతాయ చ. 
విష్ణుహృత్కంజవాసాయ మహాయోగరతాయ చ | యోగ గమ్యాయ యోగాయ యోగినాంపతయే నమః 
యోగీశాయ నమస్తుభ్యం యోగానాం ఫలదాయినే | దీనదానపరాయాపి దయాసాగర మూర్తయే. 
ఆర్తి ప్రశమనాయోగ్ర వీర్యాయ గుణమూర్తయే | వృషధ్వజాయ కాలాయ కాలకాలాయతే నమః
సర్వ దేవేశ గిరిశ శశిమౌళివిరాజిత | ఆర్తానాం శంకరస్త్వంచ శం విధేహి మహాబల.
అస్మాకం చ భయార్తానాం భవానేవ హిదృశ్యతే| దుఃఖనాశకరో దేవ ప్రసీద గిరిజాపతే.


గణాధ్యక్షా ! పార్వతీ సేవిత పాదపద్మా ! భక్తులకు అష్టసిద్ధు లొసంగు మహాదేవా ! నీకు జయమంగళ మగుత. మహామాయను గూడి విలసిల్లు పరమాత్మా ! వృషభవాహనా ! అమరేశ్వరా ! కౌలాసవాసా ! అహిర్బుధ్న్యా! మాన్య! మను! మానదా ! అజ! బహురూపా !స్వాత్మారామా ! శంభూ ! గణనాథా ! దేవా ! గిరిశా ! నీకు నమస్కారములు. మహావిభూతి దాయకా ! మహావిష్ణు సన్నుతా ! విష్ణురూపా ! విష్ణు హృదయ కమలవాసా ! మహాయోగరతా ! యోగగమ్యా ! యోగరూపా ! యోగీశా! నీకు నమస్కారములు. దేవ! యోగివర్యా! యోగిఫలదాయకా! దయాసాగరమూర్తి! దీనదయాపరా! నీకు నమస్కారములు. దేవా! యోగివర్యా! యోగిఫలదాయకా! దయాసాగరమూర్తి ! దీనదయాపరా! నీకు నమస్కారములు. దేవ ! ఆర్తిని బాపుదేవా!ఉగ్రవీర్యా! గుణనిధానా !వృషభధ్వజా ! కాల! కాలకాలా!నీకు నస్కారములు దేవా! సర్వదేవేశా ః గిరిశా ః చంద్రశేఖరా ! మహాబలా! ఆర్తుల యార్తి బావు దేవ ! మాకు మేలు వెల్గుబాట చూపించుము. మా బోటి భయార్తులకిక నీవే దిక్కు. గిరిజాపతీ ! దేవా దయ జూడుము ! మా దుఃఖము బాపుము !



శ్రీ శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున నాల్గవ యధ్యాయము నుండి.