Friday, April 3, 2020

దేవదానవకృత శ్రీ శంకర స్తుతిః(నామ సప్తతి రూపా)

దేవదానవకృత శ్రీ శంకర స్తుతిః(నామ సప్తతి రూపా)



నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే తిగ్మచక్షుషే | నమః పినాకహస్తాయ ధన్వినే కామరూపిణ.29
నమస్తే శూలహస్తాయ దణ్డహస్తాయ ధూర్జటే| మనసై#్త్రలోక్యనాథాయ భూతగ్రామశరీరిణ. 30
నమ స్సురారిహన్త్రే చ సోమార్కవహ్నిచక్షుషే| బ్రహ్మణ చైవ రుద్రాయ నమస్తే విష్ణురూపిణ.31
బ్రహ్మణ వేదరూపాయ నమస్తే విశ్వరూపిణ | సాఖ్ఖ్యయోగాయ భూతానాం నమస్తే శమ్భవాయ తే. 32
మన్మథాఙ్గవినాశాయ నమః కాలక్షయఙ్కర| రంహసే దేవదేవాయ నమస్తే వసురేతసే. 33
ఏకవీరాయ సర్వాయ నమః పిఙ్గకపర్దినే హర్త్రే కర్త్రే నమస్తుభ్యం నమ స్త్రిపురగాతినే. 34
శుద్ధబోధ ప్రబుద్ధాయ ముక్తికైవల్యరూపిణ | లోకత్రయవిదాతేరే చ వరిణన్ద్రా గ్ని రూపిణ. 35
ఋగ్యజుస్సామవేదాయ పురుషాయేశ్వరాయ చ| అగ్ర్యాయ చైవచో గ్రాయ విప్రాయ శ్రుతిచక్షుషే.36
రజసే చైవ సత్త్వాయ నమస్తే తామసాత్మనే| అనిత్యనిత్యబాసాయ నమమో నిత్యచరాత్మనే. 37
వ్యక్త్యాయ చైవావ్యక్త్యాయ వ్యక్తావ్యక్తాత్మనే నమః| భక్తానా మార్తినాసాయ ప్రియనారాయణాయచ. 38
ఉమా ప్రియాయ శర్వాయ నన్దివక్త్రాఞ్చితాయవై| ఋతుమన్వన్తర కల్పాయ పక్షమాసదినాత్మనే. 39
నానా రూపాయ ముణ్డాయ వరూథపృథుదణ్డినే| నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖణ్డినే. 40
దన్వినే రథినే చైవ యతయే బ్రహ్మచారిణ| శివాయ దేవదేవాయ నమ స్తుభ్యం నమో నమః. 41
అతని ఈ మాటవిని సురాసురులు భీతులై బ్రహ్మ విష్ణులను ముందుంచుకొని శంకరుని కడకుపోయిరి. ద్వారస్థులగు గణశులచే తెలుపబడి శివునిచే వారనుజ్ఞాతులై హేమమయము ముక్తామణి విభూషితము నిర్మల మణి సోపానయుతము వైడూర్యమణి స్తంభాలంకృతమునగు మందర గుహయందు ప్రవేశించి శివుని సమీపించిరి; అట దేవాసురులందరును బ్రహ్మను ముందుంచుకొని ఈ స్తోత్రముతో మహాదేవుని స్తుతించిరి.
విరూపాక్షా !తీక్‌ష్ణనేత్రా !పినాకహస్తా!ధన్విన్‌!కామరూపిన్‌!శూలహస్తా!దండహహస్తా!త్రైలోక్యనాధా!భూతనమూహమూర్తీ!సురారిహంతా!సోమసూర్యవహ్నినేత్రా!బ్రహ్మవిష్ణురుద్రరూపిన్‌!బ్రహ్మన్‌!వేదరూపా!విశ్వరూపిన్‌!సాంఖ్యయోగా!భూతాసంభవా!మన్మథదేహనాశకా!కాలక్షయాకరా!రంహో(వేగ) రూపా!దేవదేవా;వసురేతోరూపా!ఏకవీరా!సర్వా!పంగజటాజూటా!హర్తా ;కర్తా! త్రిపురఘాతిన్‌!శుద్ధబోధప్రబుద్ధా!ముక్తికైవల్యరూపా!లోకత్రయవిధాతా!వరుణంద్రాగ్ని రూపా!ఋగ్యజుఃసామరూపా!పురుషా!ఈశ్వరా!అగ్ర్యా!(శ్రేష్టా)ఉగ్రా!విప్రా!వేదనేత్రా!సత్త్వరజస్తమోరూపా!అనిత్యబాసా(ప్రకాశా)నిత్యచరాత్మకా!వ్యక్తరూపా!అవ్యక్తరూపా!వ్యక్తావ్యక్తారూపా!భక్తార్తినాశకా!నారాయణప్రియా!ఉమావ్రియా!శర్వా!నందిముకాంచితా!ఋతుమన్వంతర కల్పవృక్షమాసదికానాత్మక నానారూపా! ముండరూపా!వరూథ(కవచ) రూపా!పృథుదండిన్‌! కపాలహస్తా! దిగంబరా! శిఖండిన్‌! ధన్విన్‌! రథిన్‌! యతీ! బ్రహ్మచారిన్‌! శివా! దేవదేవా! సమస్తుభ్యం - నమస్తుభ్యమ్‌(నీకు నమస్కారము).


శివ పూజాదులందు ఈ నామావళి నుపయోగించుకొనవచ్చును.
ఓం విరూపాక్షాయనమః దేవదేవాయ వ్యక్తాయ

తిగ్మచక్షుషే వసురేతసే అవ్యక్తాయ

పినాకహస్తాయ ఏకవీరాయ వ్యక్తావ్యక్తాత్మనే

ధన్వినే సర్వాయ భక్తానాం ఆర్తినాశాయ

కామరూపిణే పింగకపర్దినే ప్రియనారాయణాయ

శూలహస్తాయ హర్త్రే ఉమాప్రియాయ

దండహస్తాయ కర్త్రే శర్వాయ

ధూర్జటయే త్రిపురఘాతినే నంది వక్త్రాంచితాయ

త్రైలోక్యనాధాయ శుద్ధభోదప్రబుద్ధాయ ఋతుమన్వన్తరకల్పాయ

భూతగ్రామ శరీరిణే ముక్తి కైవల్య రూపిణ పక్షమానదినాత్మనే

సురారిహన్త్రే లోకత్రయ విధాత్రే నానారూపాయ

సోమార్క వహ్నిచక్షుషే వరుణేద్రాగ్ని రూపిణ ముండాయ

బ్రహ్మణే ఋగ్యజుస్సామ వేదాయ వరూథినే60

రుద్రాయ పురుషాయ

విష్ణురూపిణే ఈశ్వరాయ పృథుదండినే
బ్రహ్మణే అగ్ర్యాయ కపాలహస్తాయ

వేదరూపాయ ఉగ్రాయ  దిగ్వాసాయ (సనే)

విశ్వరూపిణ విప్రాయ ధన్వినే

యోగాయ శ్రుతిచక్షుసే రథినే

సాంఖ్యాయ రజసే యతయే

భూతానాం శంభవాయ  సత్త్వాయ బ్రహ్మచారిణే

మన్మథాంగ వినాశాయ తామసాత్మనే శివాయ

కాలక్షయంకరాయ అనిత్య నిత్యభాసాయ దేవదేవాయనమః

రంహసే నిత్య చరాత్మనే
శ్రీ మత్స్య మహాపురాణమున అమృత మథనమున ఈశ్వరుడు కాలకూటమును భక్షించుటయను రెండు వందల నలువది తొమ్మిదవ యధ్యాయము  నుండి.